1,400 కువైటీ దినార్లకు చేరుకున్న డొమెస్టిక్ హెల్పర్స్ ఫీజు

- June 20, 2022 , by Maagulf
1,400 కువైటీ దినార్లకు చేరుకున్న డొమెస్టిక్ హెల్పర్స్ ఫీజు

కువైట్: డొమెస్టిక్ హెల్పర్స్‌ని తీసుకొచ్చేందుకోసం విధించే రుసుము పెంపు విషయమై కామర్స్ మినిస్ట్రీ మరియు లేబర్ ఆఫీసుల మధ్య ప్రాథమికంగా ఓ ఒప్పందం కుదిరింది. గతంలో వున్న 890 కువైటీ దినార్ల విషయమై కొంత గందరగోళం కొనసాగుతోంది. పెంపు ఎలా వుండాలన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి.1,200 కువైటీ దినార్ల మేర (ప్రయాణ టిక్కెట్లతో కలుపుకుని) వుండాలన్నది ఓ ప్రతిపాదనగా కనిపిస్తోంది.కాగా, 1,100 నుంచి 1,400 మధ్య పెంపు వుండొచ్చని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com