ఆ మాస్ డైరెక్టర్‌తో సాయి తేజ్ సినిమా నిజమేనా.?

- June 20, 2022 , by Maagulf
ఆ మాస్ డైరెక్టర్‌తో సాయి తేజ్ సినిమా నిజమేనా.?

‘ఏమైంది ఈ వేళ’ వంటి కూల్ రొమాంటిక్ సినిమాతో డైరెక్టర్‌గా పాపులర్ అయిన సంపత్ నంది, తర్వాత వరుసగా మాస్ కంటెంట్ కథలనే సెలెక్ట్ చేసుకుంటూ, మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు.రామ్ చరణ్‌తో ‘రచ్చ’, మాస్ రాజా రవితేజ‌తో ‘బెంగాల్ టైగర్’ తదితర సినిమాలు తెరకెక్కించి హిట్టు కొట్టిన  సంపత్ నందికి ఈ మధ్య పెద్దగా హిట్లు లేవు.
గోపీచంద్‌తో ‘గౌతమ్ నందా’, ‘సీటీ మార్’ సినిమాలు తెరకెక్కించాడీ మాస్ డైరెక్టర్. కానీ, రెండూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని, ఓ మంచి కథతో రావాలని వెయిట్ చేస్తున్నాడట. ఆ క్రమంలోనే అనుకున్న స్టోరీ పట్టేశాడట సంపత్ నంది.

ఓ మాంచి యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌గా ఆ సినిమాని మలచబోతున్నాడట సంపత్ నంది. అందుకు తగ్గ హీరో కోసం వేట మొదలెట్టాడు. ఆ నేపథ్యంలోనే సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది మనసులో మెదిలాడట. వెంటనే సాయి తేజ్‌కి కథ నెరేట్ చేశాడట సంపత్ నంది.
దాదాపు సాయి తేజ్‌కి ఈ సినిమా నచ్చిందట. కానీ, అక్కడక్కడా చిన్న చిన్న మార్పులు చేస్తే బావుంటుందన్న సెకండ్ థాట్‌లో తేజు వున్నాడట.త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఫుల్  డీటెయిల్స్ వెల్లడి కానున్నాయ్.

కాగా, ‘రిపబ్లిక్’ సినిమా తర్వాత తేజు ఈ మధ్యనే తన కొత్ర ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించాడు.కార్తీక్ అనే కొత్త దర్శకుడితో ప్రస్తుతం తేజు ఓ సినిమా చేస్తున్నాడు.యాక్సిడెంట్ కారణంగా కొన్ని నెలలు రెస్ట్‌లోనే వుండిపోయిన తేజు, మళ్లీ షూటింగ్స్ షురూ చేయడంతో పాటు, కొత్త ప్రాజెక్టుల పైనా కంప్లీట్‌గా  ఫోకస్ పెట్టాడట.ఈ నేపథ్యంలోనే జరుగుతున్న ప్రచారం నిజమై, సంపత్ నంది సినిమాని తేజు లైన్‌లో పెడతాడేమో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com