కరణ్ జోహార్ అలా దొరికిపోయాడేంటీ.!
- June 20, 2022
రాజుగారి పెద్ద భార్య మంచిది.. అంటే చిన్న భార్య మంచిది కాదన్నట్టేగా.. అనే నానుడి తెలిసిందే. తాజాగా కరణ్ జోహార్ వ్యాఖ్యలను ఈ తరహాలోనే పోల్చుతూ కొందరు విమర్శిస్తున్నారు. ఇంతకీ కరణ్ జోహార్ ఏం మాట్లాడాడు. ఎవరిని నొప్పించాడు.?
మొన్నా మధ్య ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి తెగ పొగిడేసిన కరణ్ జోహార్, తాజాగా ‘కేజీఎఫ్ 2’ సినిమా చూశాడట. సినిమా ఆయనకు చాలా బాగా నచ్చేసిందట. అఫ్కోర్స్.. ‘కేజీఎఫ్ 2’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. చాలా మంది చాలా రకాలుగా ‘కేజీఎఫ్ 2’ని ప్రశంసలతో మెప్పించేశారు కూడా.
ఇక, ఇప్పుడు కరణ్ జోహార్ వంతు వచ్చినట్లుంది. ఓకే, ‘కేజీఎఫ్ 2’ సినిమా చాలా బాగుంది.. అని కరణ్ మెచ్చుకోవడంలో ఎలాంటి తప్పు లేదండోయ్. అసలు చిక్కల్లా.. సౌత్ సినిమాలు చాలా బాగుంటున్నాయి. కథల ఎంపికలోనూ, టేకింగ్‌లోనూ సౌత్ డైరెర్టర్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అందుకే ఆ సినిమాలు అన్నిచోట్లా సక్సెస్ అవుతున్నాయ్. మన బాలీవుడ్ బాక్సాఫీస్‌ని సైతం సౌత్ సినిమాలు శాసిస్తున్నాయి.. అని కరణ్ జోహార్ అన్నారు. అందులోనూ వెతికితే పెద్దగా తప్పు కనిపించదనుకోండి.
బాలీవుడ్లో కథల ఎంపిక పెద్దగా బాగోడం లేదు. సినిమా మేకింగ్ కూడా అంచనాలను అందుకోలేకపోతోంది.అందుకే నార్త్ ఫిలిం మేకర్లు నమ్మకం కోల్పోతున్నారు అంచనాలను అందుకోవడంలో.. అని వ్యాఖ్యానించిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయ్. నార్త్ ఫిలిం మేకర్ల మనోభావాలు దెబ్బ తీసేలా కరణ్ జోహార్ వ్యాఖ్యలున్నాయని గుస్సా అవుతున్నారు. అదీ సంగతి.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







