ఇళయ దళపతి విజయ్: వారసుడ్ని దించుతున్నాడహో.!
- June 21, 2022
‘ఉప్పెన’ సినిమాతో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ సినిమా రావల్సిన టైమ్ కన్నా, చాలా లేట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయినా కానీ, మంచి విజయం అందుకుంది. కంటెంట్ వున్న సినిమాల లెక్క అలాగే వుంటుంది మరి.
‘ఉప్పెన’ సక్సెస్ అవ్వడమే కాదు, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడీ సినిమాపై తమిళ స్టార్ హీరో కన్ను పడిందని తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు, ఇళయ దళపతి విజయ్. అదేంటీ. ఆ సినిమాని కొంపతీసి విజయ్ గాని రీమేక్ చేసేస్తాడా.. ఏంటీ.? అనుకుంటున్నారా.? అవునండి నిజమే. కానీ, ఆయన కోసం కాదు. ఆయన వారసుడు జాసన్ కోసం.
విజయ్ కుమారుడు జాసన్ కూడా హీరో అవ్వాలని ఆశపడుతున్నాడట. హీరో కొడుకు హీరోనే అవ్వాలనేం రూల్ లేదు. సో, జాసన్‌ని సినిమాల్లోకి రమ్మని నేనేం ఫోర్స్ చేయలేదు, కానీ జాసన్‌కి సినిమాల పట్ల ఆసక్తి మొదలైంది. ఆ క్రమంలోనే యాక్టింగ్‌లో గత కొంత కాలంగా ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. త్వరలోనే హీరోగా లాంఛ్ అవ్వడానికి రెడీగా వున్నాడు.. అని జాసన్ గురించి విజయ్ చెప్పుకొచ్చాడు. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఉప్పెన’ కథ పట్ల విజయ్ ఒకింత ఆసక్తిగా వున్నట్లు తెలుస్తోంది. అలాగే, మరికొన్ని కథలు వింటున్నాడట విజయ్. సో, మొత్తానికి అతి త్వరలోనే జాసన్ ఎంట్రీ వుండబోతోందని అర్ధమవుతోంది.
మరోవైపు విజయ్, తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘దళపతి 66’ అంటూ ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడే ట్రెండింగ్‌లో వుంటున్నాయి. విజయ్‌కి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు