కొడుకు విషయంలో ఈసారి పూరీ జగన్నాధ్ కెలుక్కోవడంలేదా.?

- June 21, 2022 , by Maagulf
కొడుకు విషయంలో ఈసారి పూరీ జగన్నాధ్ కెలుక్కోవడంలేదా.?

డైరెక్టర్‌గా స్టార్‌డమ్ వున్నోడు పూరీ జగన్నాధ్. పూరీతో సినిమాలు చేయాలని ఒకప్పుడు హీరోలు తెగ ఉబలాటపడేవారు. అయితే, ఈ మధ్య ఆయన కెరీర్ కాస్త నత్తనడకన సాగుతుందనుకోండి. మొన్నామధ్య ‘ఇస్మార్ట్ శంకర్’‌తో పూరీ మళ్లీ గాడిన పడ్డాడు. ఆ జోష్‌తోనే కొడుకు ఆకాష్ పూరీతో ‘రొమాంటిక్’ సినిమా తెరకెక్కించాడు. కానీ, అది బాక్సాఫీస్ వద్ద కుదేలయ్యింది. ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి పూరీ మార్కు మ్యాజిక్కు, జిమ్మిక్కులూ అన్నీ ఇన్నీ కావు. ఏం చేసినా వర్కవుట్ కాలేదు.

అంతకు ముందే ఆకాష్ పూరీ నటించిన ‘మెహబూబా’ సినిమాకీ పూరీ డైరెక్టర్ కాకపోయినా, తెర వెనకుండి, తన సహాయ సహకారాలు అందించాడు. ఆ సినిమా కూడా దెబ్బ కొట్టేసింది. అందుకే తాజా సినిమా ‘చోర్ బజార్’లో పూరీ అస్సలు వేలు పెట్టలేదట.

ఆకాష్ మంచి నటుడు. యాక్టింగ్‌లో చాలా మెచ్యూరిటీ చూపిస్తాడు. ఎంతటి పవర్ ఫుల్ డైలాగులైనా అలవోకగా చెప్పగల సత్తా వున్నోడు. ఆకర్షించే బేస్ టోన్ వున్నోడు కూడా. కానీ, సరైన డైరెక్టర్ పడకపోవడం వల్లనో, లేక కథల ఎంపిక బాగుండకపోవడం వల్లనో సక్సెస్ కాలేకపోతున్నాడు.

తాజాగా ఆకాష్ పూరీ ‘చోర్ బజార్’ అనే సినిమాతో వస్తున్నాడు. ఈ నెల 24 ఈ సినిమా రిలీజ్ కానుంది. ‘జాంబిరెడ్డి’ ఫేమ్ జీవన్ రెడ్డి ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమాకి సంబంధించి పూరీ జగన్నాధ్ కథ కూడా వినలేదట. అలాగే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోనూ అస్సలు వేలు పెట్టి కెలకలేదట. ఏమో చూడాలి మరి, ఈ సినిమా అయినా ఆకాష్ పూరీ సక్సెస్ ఇస్తుందో లేదో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com