లావణ్య త్రిపాఠి హ్యాపీ 340
- June 22, 2022
హైదరాబాద్: మత్తువదలరా చిత్రంతో ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం హ్యాపీ బర్త్‌డే. ప్రముఖ కథానాయిక లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తుంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గుండు సుదర్శన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. కాగా టీజర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రబృందం.. ఇటీవల చిత్రంలోని పాత్రలను ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రచార చిత్రాలను విడుదల చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో భాగంగానే మంగళవారం కథానాయిక లావణ్యత్రిపాఠి పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో హ్యాపీ 340గా లావణ్య కనిపించబోతుంది. ఆమె పాత్ర ఎవ్వరూ ఊహించని విధంగా, పూర్తి వినోదాత్మకంగా వుండబోతుందని చిత్ర బృందం తెలిపింది ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, డిఓపీ: సురేష్ సారంగం, ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్, ఫైట్స్: శంకర్ ఉయ్యాల, కాస్ట్యూమ్ డిజైనర్: తేజ్ ఆర్, లైన్ ప్రాడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబా సాయి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాల సుబ్రమణ్యం కేవీవీ, ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్ కుమార్ కందుల, మార్కెటింగ్: ఫస్ట్‌షో, పీఆర్ఓ: శేఖర్-వంశీ, మడూరి మధు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: రితేష్ రానా.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!







