దిగ్విజయవంతంగా 200వ రోజుకు చేరుకున్న 'ఘంటసాల స్వరరాగ మహాయాగం'

- June 22, 2022 , by Maagulf
దిగ్విజయవంతంగా 200వ రోజుకు చేరుకున్న \'ఘంటసాల స్వరరాగ మహాయాగం\'

ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా శ్రీ సాంస్కృతిక కళా సారథి సింగపూర్ వంశీ ఇంటర్నేషనల్ మరియు శుభోదయం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 366 రోజులపాటు ఘంటసాల వారి శతజయంతి సంవత్సరం సందర్భంగా నిర్వహించబడుతున్న "ఘంటసాల స్వరరాగ మహాయాగం" కార్యక్రమం 200వ రోజుకు దిగ్విజయవంతంగా చేరుకుంది. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక అంతర్జాల కార్యక్రమానికి ఘంటసాల వారి కోడలు కృష్ణకుమారి విచ్చేసి జ్యోతి ప్రకాశనం గావించారు. ప్రముఖ సినీ కవి భువనచంద్ర, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ తదితర ప్రముఖ అతిధులు, ప్రపంచ నలుమూలల నుండి వివిధ దేశాల తెలుగు సంస్ధల అధ్యక్షులు, పేరెన్నికగన్న గాయనీ గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభినందనలు తెలియజేశారు. గాయనీగాయకులు చక్కటి ఘంటసాలవారి పాటలతో అలరించారు.  

"న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, హాంకాంగ్, మధ్య ఆసియా దేశాలైన ఖతార్ యూఏఈ, దక్షిణాఫ్రికా,యుగాండా, కెనడా, అమెరికా దేశాల నుండి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని" డా.వంశీ రామరాజు తెలియజేశారు. 

ఈ కార్యక్రమ ప్రధాన నిర్వాహక బృందం రత్నకుమార్ కవుటూరు, రాధిక మంగిపూడి, డా. వంగూరి చిట్టెన్ రాజు, డా.శ్రీ లక్ష్మీ ప్రసాద్ కలపటపు ప్రసన్నలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని శుభోదయం మీడియా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com