తెలంగాణ రాష్ట్ర టీవీ, చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అనిల్ కూర్మాచలం
- June 22, 2022
లండన్: తెలంగాణ రాష్ట్ర టీవీ, చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం నియామక అయ్యారు.ఈ క్రమంలో లండన్‌లోని ఎన్నారైలు సంబరాలు చేసుకున్నారు.కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ దూసరి మాట్లాడుతూ.. ఉద్యమ కాలం నుంచి అనిల్ కూర్మాచలం కేసీఆర్ వెంటే నడిచినట్లు పేర్కొన్నారు.ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ర్యాలీలు ధర్నాలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు.బంగారు తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమ స్పూర్తితో పని చేస్తున్నట్లు వెల్లడించారు. నేడు ఆయనకు దక్కిన గౌరవాన్ని క్రమ శిక్షణ గల ప్రతి ఉద్యమకారుడికీ దక్కినట్లు భావిస్తున్నామన్నారు. అనిల్ కూర్మాచలం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల అన్నారు.మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకున్నారు.
ఈ సందర్బంగా అనిల్ కూర్మాచలం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితలకు ధన్యవాదాలు తెలిపారు.టీఆర్ఎస్‌లో క్రమశిక్షణగా పని చేసిన వారికి ఎప్పటికైనా న్యాయం జరుగుతుందనే విషయం మరోసారి రుజువైందన్నారు.కుటుంబ సభ్యుల పక్షాన లండన్‌లోని ఎన్నారై సంస్థలకు, మిత్రులకు ప్రభలత కూర్మాచలం కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంబరాలలో ఎన్నారై తెరాస యుకే అధ్యక్షుడు అశోక్ దుసరి, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుడుల, కుటుంబ సభ్యులు ప్రభలత కూర్మాచలం, నిత్య శ్రీ, టాక్ మరియు ఎన్నారై తెరాస నాయకులు వెంకట్ రెడ్డి దొంతుల, స్వాతి బుడగం, శుష్మున రెడ్డి, సత్య చిలుముల, సురేష్ బుడగం, జాహ్నవి, నవీన్ రెడ్డి, రవి రెటినేని, సుప్రజ పులుసు, మల్లా రెడ్డి, హరిబాబు గౌడ్ నవాపేట, శ్రీ శ్రావ్య వందనపు, సత్యపాల్ రెడ్డి పింగిలి, రవి ప్రదీప్ పులుసు, పృథ్వీ రావుల,అపర్ణ, రవికిరణ్, మణి తేజ, జస్వంత్, నికిల్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









