'చోర్ బజార్' మూవీ రివ్యూ
- June 24, 2022
సినిమా రివ్యూ:
నటీనటులు: ఆకాష్ పూరి, గెహనా సిప్పీ, సునీల్, సంపూర్ణేష్ బాబు తదితరులు
డైరెక్టర్: జీవన్ రెడ్డి
సమర్పణ: యూవీ క్రియేషన్స్
ప్రొడక్షన్ బ్యానర్: ఐ.వి. ప్రొడక్షన్స్ పతాకం
సంగీతం: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: జగదీష్ చెకటి
పూరీ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా రూపొందిన చిత్రమే ‘చోర్ బజార్’. ‘జార్జ్ రెడ్డి’ ఫేమ్ జీవన్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కించాడు. ‘మెహబూబా’, ‘రొమాంటిక్’ చిత్రాలతో ఆశించిన రేంజ్‌లో ఆకట్టుకోలేని ఆకాష్ పూరీకి హీరోగా ఈ సినిమా అయినా కలిసొచ్చిందో లేదో చూడాలంటే, కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
హైద్రాబాద్‌లోని పాత బస్తీలో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. బచ్చన్ పాండే (ఆకాష్ పూరీ) పాత బస్తీలో పనీ పాటా లేని ఓ పోకిరిలా తీరుగుతుంటాడు. పొట్ట పోసుకోవడం కోసం కారు టైర్లు దొంగిలించి అమ్ముకుంటాడు. ఆ క్రమంలో హీరోయిన్‌తో పరిచయం ఏర్పడుతుంది. హీరోయిన్ (గెహనా సిప్పీ) ఓ మూగ అమ్మాయి. చూడగానే ఆ అమ్మాయి ప్రేమలో పడిపోతాడు. ఈ క్రమంలోనే ఓ విలువైన వజ్రాన్ని దొంగతనం చేస్తాడు బచ్చన్ పాండే. ఆ తర్వాత నుంచి జరిగిన పరిణామాలు బచ్చన్ పాండే లైఫ్‌లో టర్నింగ్‌కి కారణమవుతాయ్. ఆ పరిణామాలేంటీ.? మూగమ్మాయి ప్రేమని బచ్చన్ పాండే దక్కించుకున్నాడా.? వజ్రం దొంగిలించిన బచ్చన్ పాండే జీవితం చివరికి ఏ మలుపు తిరిగింది.? అనేది తెలియాలంటే ధియేటర్‌లో సినిమా చూడాల్సిందే.
నటీనటులు ఎలా చేశారంటే:
బచ్చన్ పాండే పాత్రలో ఆకాష్ పూరీ ఒదిగిపోయాడు. ఎప్పటిలాగే తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. మూగ అమ్మాయిగా గెహనా సిప్పీ కూడా బాగా సెట్ అయ్యింది. హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ బాగుంది. సునీల్, సంపూర్ణేష్ బాబు తమకిచ్చిన పాత్రల్లో ప్రేక్షకుల్ని బాగా నవ్వించారు. ఇతర నటీనటులు తమ పాత్ర పరిధి మేర బాగానే నటించారు.
సాంకేతిక విభాగం:
జగదీష్ చెకటి సినిమాటోగ్రఫీ రెగ్యులర్‌గా అనిపించింది. సురేష్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవడానికేం లేవు. చోర్ బజార్ సెట్ చాలా కామన్‌గా అనిపిస్తుంది.ఇక డైరెక్టర్ విషయానికి వస్తే, తాను అనుకున్న కథ వేరు. తెరకెక్కించిన విధానం వేరు. ఎక్కడి నుంచో స్టార్ట్ చేసి, ఎక్కడికో కథని తీసుకెళ్లిపోయాడు. దాంతో ప్రేక్షకులు కథకి కనెక్ట్ కాలేరు.
ప్లస్ పాయింట్స్:
ఫస్టాఫ్ కామెడీ
మైనస్ పాయింట్స్:
అర్ధం పర్ధం లేని స్క్రీన్ ప్లే
కన్ఫ్యూజింగ్ క్లైమాక్స్
విశ్లేషణ:
ఫస్టాఫ్ అంతా సునీల్, తదితర నటీ నటుల పర్‌ఫామెన్స్, దొంగగా ఆకాష్ పూరీ చేసే చిలిపి పనులతో ఒకింత సరదాగానే సాగిపోతుంది. కానీ, సెకండాఫ్‌కి వచ్చేసరికి కథ మొత్తం కన్ఫ్యూజన్‌లో పడిపోతుంది. వజ్రం దొంగతనానికి సంబంధించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని గ్రిప్పింగ్‌గా చెప్పడంలో డైరెక్టర్ పూర్తిగా ఫెయిలయ్యాడు. స్క్రీన్ ప్లేలోనూ చాలా లోపాలున్నాయి. దాంతో క్లైమాక్స్ కూడా తేలిపోయింది.
చివరిగా:
ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించకపోవచ్చు. ఆకాష్ పూరీ మరో తప్పులో కాలేసినట్లే. ఆకాష్ కెరీర్‌కి ‘చోర్ బజార్’ ఏమాత్రం ఉపయోగపడకపోవచ్చు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







