యజమాని అనుమతి లేకుండా రన్అవే స్థితిని సరిదిద్దవచ్చు

- June 24, 2022 , by Maagulf
యజమాని అనుమతి లేకుండా రన్అవే స్థితిని సరిదిద్దవచ్చు

యజమాని లేదా సంస్థలో దగ్గర పనిచేసే విదేశీ ఉద్యోగులపై జారీ చేసిన రన్అవే స్థితిని వారి అనుమతి రద్దు చేయడానికి సౌదీ మానవవనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వశాఖ (MHRSD) అధికారికంగా సర్క్యులర్ జారీ చేసింది. 

 రన్అవే(పారిపోవటం) నోటిఫికేషన్ ను ఈ విధంగా రద్దు చేయవచ్చు: 

1. యజమాని కల్పించే సదుపాయ స్థితి "ఉనికిలో లేదు" అని చూపబడినట్లతే. 

2. సదుపాయాల యొక్క స్థితి విధానం లో ఉందని పేర్కొంది. అలాగే, య44జమాని సౌకర్యం కోసం సంభందిత ఫైల్ వ్యవధి ఉంచిన తేదీ నుండి 30 రోజుల దాకా ఉన్నట్లయతే. 

3. యజమాని యొక్క సదుపాయాల స్థితి రెడ్ జోన్ లో ఉన్న సందర్భంలో 75 శాతం కంటే తక్కువ కాకుండా తన కింద పనిచేసే కార్మికుల ఒప్పందాలను డాక్యుమెంట్ చేయడానికి కట్టుబడి ఉండకపోతే. 

4. యజమాని యొక్క సదుపాయాల స్థితి రెడ్ జోన్ లో ఉన్నట్లయతే మరియు దాని మొత్తం శ్రామిక శక్తిలో 80 శాతం కార్మికుల వేతనాలను రక్షించడానికి కట్టుబడి ఉండకపోతే. 

పైన వాటితో సహా కార్మికుడి సేవలను బదిలీ చేయాలనుకునే సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలను కూడా సర్క్యులర్ లో స్పష్టం చేసింది: 

1. కార్మికుడి సేవలను వేరే వారికి బదిలీ చేయాలనుకునే యజమాని సంబంధిత రుసుములు భరించాలి.అలాగే య5జమాని లేదా సంస్థలు తప్పనిసరిగా ఈ- సర్టిఫైడ్ లెటర్ ను జారీ చేయాలి. 

2. జీవో 4/11/1440H ప్రకారం కార్మిక చట్టం లోని ఆర్టికల్ 15 యొక్క రెండవ నియమంలో పేర్కొన్న విధంగా కార్మికుడిని బదిలీ చేసే విధానాలను పూర్తి చేయడానికి అవసరమైన నియమ నిబంధనలను సంస్థలు తప్పనిసరిగా పాటించాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com