మెగా అప్‌డేట్: సంక్రాంతి బరిలో చిరంజీవి
- June 24, 2022
మెగాస్టార్ చిరంజీవి 154 వ చిత్రం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్ చేస్తూ ఇటీవల ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో జాలరి పాత్రలో చిరంజీవి కనిపించనున్నాడనీ పోస్టర్ ద్వారా మేకర్లు రివీల్ చేశారు.
అన్నట్లు ఇది స్ర్టెయిట్ తెలుగు మూవీ. పక్కా మాస్ ఎంటర్‌టైనింగ్ కాన్సెప్టుతో రూపొందిస్తున్నారు. చిరంజీవి మార్క్ మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో చూపించబోతున్నాడు డైరెక్టర్ బాబీ.
కాగా, ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఫ్యాన్స్‌కి మెగా సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మైత్రీ మూవీస్ మేకర్లు ఈసినిమాని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఆల్రెడీ చిరంజీవి రెండు రీమేక్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి మలయాళ రీమేక్ ‘గాడ్ ఫాధర్’ కాగా, తమిళ రీమేక్ ‘భోళా శంకర్’ ఇంకోటి. ఈ రెండు సినిమాలూ కొంత మేర షూటింగ్ జరుపుకున్నాయి. ఈ ఏడాది వరుసగా ఈ రెండు సినిమాలూ ప్రేక్షకుల ముందుకి వచ్చేస్తాయి.
‘గాడ్ ఫాదర్’ రీమేక్‌లో హీరోయిన్‌గా నయనతార నటిస్తుండగా, ‘భోళా శంకర్‌లో తమన్నా, చిరుతో జత కడుతోంది. సాయి పల్లవి ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







