వెర్సటైల్ డైరెక్టర్‌తో అక్కినేని బుల్లోడి కొత్త సినిమా షురూ.!
- June 24, 2022అక్కినేని బుల్లోడు నాగ చైతన్య దూకుడు పెంచాడు. వరుసగా ప్రాజెక్టులు ఓకే చేస్తున్నాడు. ఇప్పటికే చైతూ నటిస్తోన్న ‘థాంక్యూ’ సినిమా త్వరలో రిలీజ్‌కి రెడీగా వుంది. రాశీ ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే, బాలీవుడ్లో చైతూ నటిస్తోన్న ‘లాల్ సింగ్ చద్దా’ కూడా రేపో మాపో రిలీజ్‌కి రెడీగా వున్న సంగతి తెలిసిందే.
అమీర్ ఖాన్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. చైతూకి ఇదే తొలి బాలీవుడ్ మూవీ కావడం విశేషం. కాగా, ప్రస్తుతం నాగ చైతన్య ఓ కొత్త ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించాడు. విలక్షణ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య ఓ సినిమాని ఓకే ఛేశాడు.
ఆ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా స్టార్ట్ అయ్యింది. త్వరలోనే సెట్స్ మీదికి తీసుకెళ్లనున్నారట. మాస్ర్టో ఇళయరాజా ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలిసి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తుండడం విశేషం, కాగా, ఈ సినిమాలో ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది.
మొన్నీ మధ్యనే నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా ‘బంగార్రాజు’ సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయమే అందుకుంది. సో, కృతిశెట్టితో చైతూకి ఇది రెండో సినిమా అన్నమాట. కథ, కథనాల పరంగా ఇంతకు ముందెన్నడూ లేని సరికొత్త కథతో ఈ సినిమా తెరకెక్కబోతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం.
అన్నట్లు కాజల్ అగర్వాల్‌తో ‘లైవ్ టెలికాస్ట్’ అను వెబ్ సిరీస్ తెరకెక్కించిన డైరెక్టరే ఈ వెంకట్ ప్రభు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







