ఫ్యాన్స్‌కి స్వయంగా టిక్కెట్స్ పంపిస్తానంటోన్న యంగ్ హీరో: ‘సమ్మతమే’నా.?

- June 24, 2022 , by Maagulf
ఫ్యాన్స్‌కి స్వయంగా టిక్కెట్స్ పంపిస్తానంటోన్న యంగ్ హీరో: ‘సమ్మతమే’నా.?

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన సినిమా ‘సమ్మతమే’. హీరోయిన్ చాంధినీ చౌదరి ఈ సినిమాలో కిరణ్ అబ్బవరానికి జోడీగా నటించింది. కాగా, ఈ సినిమా ఈ రోజు అనగా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాకి ప్రమోషన్స్ బాగా చేశారు. సినిమాకీ ప్రీ రిలీజ్ బజ్ బాగానే వుంది. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. గోపీనాధ్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

అయితే, ఏ సినిమా రిలీజైనా టిక్కెట్టు రేట్ల పెంపు అనేది ఓ పెద్ద సమస్యగా మారింది. పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా, ఆ సమస్యను ఎదుర్కొవాల్సి వస్తోంది. ప్రమోషన్లలో భాగంగా మా సినిమాకి టిక్కెట్టు రేట్లు పెంచడం లేదహో.. అంటూ నిర్మాతలు ప్రత్యేకంగా ప్రకటించుకోవాల్సి వస్తోంది.

అలాగే కిరణ్ అబ్బవరం సినిమాకి కూడా ఈ సమస్య వెంటాడింది. సోషల్ మీడియాలో కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ ఇదే విషయమై కొన్ని ప్రశ్నలు లేవనెత్తారట. సినిమా చూడాలని వున్నా, చూసే పరిస్థితి లేదని ఫ్యాన్స్ గగ్గోలు పెట్టడంతో, కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్‌కి ఓ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు.

ఓ వీడియో ప్రకటన ద్వారా ఫ్యాన్స్ ఊరు, పేరు, అడ్రస్ తనకు పంపిస్తే వాళ్లకి టిక్కెట్స్ పంపిస్తానని హామీ ఇచ్చాడు. ఖచ్చితంగా సినిమాని ధియేటర్లోనే చూడమని సూచించాడు. దీంతో మనోడు నెట్టింట్లో తెగ ట్రెండింగ్ అయిపోతున్నాడు. ఏది ఏమైనా కిరణ్ అబ్బవరం ప్లానింగ్ అయితే పోలా అదిరిపోలా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com