పార్క్ చేసిన కారుకు నిప్పంటించిన వ్యక్తి అరెస్ట్
- June 25, 2022
బహ్రెయిన్: రిఫా ప్రాంతంలో పార్క్ చేసిన కారుకు నిప్పంటించిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. నిప్పంటించిన వాహనం పక్కనే పార్క్ చేసిన మరో మూడు కార్లకు కూడా మంటలు అంటుకొని దగ్ధం అయ్యాయని పోలీసులు తెలిపారు. సమాచారం అందగానే ఘటనాస్థలికి చేరుకున్న సివిల్ డిఫెన్స్ బలగాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నేరస్థలాన్ని సందర్శించి పరిశీలించింది. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రాంతంలోని ఇళ్లలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలో.. ఆగివున్న కారు వద్దకు ఓ వ్యక్తి వస్తూ అందులో ఏదో పోసి నిప్పంటించడం కనిపించింది. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







