రణ్‌బీర్ కపూర్ డబుల్ ధమాకా: సౌత్ సినిమా ఇంపాక్ట్ బ్రేక్ చేయగలడా.?

- June 25, 2022 , by Maagulf
రణ్‌బీర్ కపూర్ డబుల్ ధమాకా: సౌత్ సినిమా ఇంపాక్ట్ బ్రేక్ చేయగలడా.?

బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయనున్నాడు. రెండూ భారీ బడ్జెట్ సినిమాలే. అందులో ఒకటి ‘బ్రహ్మాస్త్ర’ కాగా, ఇంకోటి ‘షంషేరా’. ఈ రెండు సినిమాలూ ఇటీవలే ట్రైలర్ ఫెస్టివల్స్ జరుపుకున్న సంగతి తెలిసిందే.

‘బ్రహ్మాస్త్ర’ విషయానికి వస్తే, ఏమంత ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఈ ట్రైలర్‌కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా అదేమంత కలిసి రాలేదు. ఇక వెరీ లేటెస్టుగా రిలీజైన ‘షంషేరా’ ట్రైలర్ విషయానికి వస్తే, ఇది కూడా సో సోగానే ఆకట్టుకుంటోంది.
అసలు సమస్య ఏంటంటే, సౌత్ సినిమా బోర్డర్లు దాటేసింది. ప్రపంచం మొత్తం సౌత్ సినిమా  వైపు చూసేలా తన గొప్పతనాన్ని చాటుకుంటోంది. తెలుగులో ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు, కన్నడ సినిమా ‘కేజీఎఫ్’ అన్ని సినిమాలకీ ప్రామాణికంగా మారిపోయాయ్.

దాంతో ఏ భారీ బడ్జెట్ సినిమా అయినా, ఆటోమెటిగ్గా వీటితో పోలికకి వెళ్లిపోతోంది. వాటితో పోల్చుకున్నాకా, తక్కువా.. ఎక్కువా.? అనే విబేధాలొచ్చేస్తున్నాయ్. ముఖ్యంగా బాలీవుడ్ ఈ సమస్యను ఘోరంగా ఎదుర్కొంటోంది.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌కి స్ర్టెయిట్ హిట్ ఒక్కటి కూడా లేదు. దాంతో బాలీవుడ్ ఆశలన్నీ ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ పైనే. రెండు సినిమాలూ బ్లాక్ బస్టర్స్ అవ్వాలని ఆశపడుతోంది. అయితే, ఈ సినిమాలకు అంత సీనుందా.? సౌత్ సినిమాని ఫేస్ చేయగల స్టామినా రణ్‌బీర్ కపూర్‌కి వుందా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com