వెంకీతో శ్రీకాంత్ అడ్డాల: ముచ్చటగా మూడోస్సారి
- June 25, 2022
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే సినిమా కోసం ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్ర్కీన్ పైకి తీసుకొచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబులను ఆన్ స్క్రీన్ అన్నదమ్ములుగా మార్చేసి, బ్లాక్ బాస్టర్ మల్టీ స్టారర్ హిట్ కొట్టేశారు శ్రీకాంత్ అడ్డాల.
ఆ తర్వాత మహేష్‌తో ‘బ్రహ్మోత్సవం’ సినిమా తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల దారుణంగా ఫెయిలయ్యారు. కానీ, వెంకటేష్‌తో ‘నారప్ప’ అనే సీరియస్ మూవీని తెరకెక్కించి హిట్ కొట్టారు. అదీ కరోనా ప్యాండమిక్ టైమ్‌లో ఓటీటీ రిలీజ్ ఇచ్చి మరీ సెన్సేషనల్ అయ్యారు శ్రీకాంత్ అడ్డాల.
తాజాగా ఈ డైరెక్టర్ మరో మల్టీ స్టారర్ మూవీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సారి కూడా ఈయన వెంకీనే తన సినిమాలో హీరోగా ఎంచుకున్నారు. ఇంకో హీరోగా మాస్ రాజా రవితేజను సెలెక్ట్ చేసుకున్నారట. వెంకీ, రవితేజ కొత్త కాంబోలో ఈ ప్రాజెక్ట్ రూపొందే అవకాశాలు కనిపిస్తున్నాయ్.
ఇంకా అధికారికంగా ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదు కానీ, త్వరలోనే వివరాలు వెల్లడి కానున్నాయట. ఒకవేళ ప్లానింగ్ సెట్ అయ్యి, ప్రాజెక్ట్ ఓకే అయితే, వెంకీతో శ్రీకాంత్ అడ్డాలకి ఇది మూడో సినిమా అవుతుంది. రీసెంట్గా వెంకటేష్ ‘ఎఫ్ 3’ సినిమాతో హిట్ కొట్టి జోష్ మీదున్న సంగతి తెలిసిందే. అలాగే, రవితేజ.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం







