వరల్డ్ ఫస్ట్ మెడికల్ టూరిజం హబ్
- April 10, 2016
క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ దుబాయ్, షేక్ హమమాద్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆదివారం ప్రపంచంలోని తొలి మెడికల్ టూరిజం హబ్ దుబాయ్‌ని ప్రారంభించారు. దుబాయ్ హెల్త్ అథారిటీ (డిహెచ్‌ఎ), వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఏ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ విజన్ నేపథ్యంలో హెల్త్ టూరిజంని అభివృద్ధి చేశారు. దుబాయ్ సిటీ మెడికల్ మరియు ఫ్యామిలీ సాపింగ్ టూరిజంకి కేంద్ర బిందువుగా మారనుంది. 2020 దుబాయ్ ఎక్స్‌పో 500,000 మంది పర్యాటకుల్ని ఆకర్షించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. మెడికల్ టూరిజం సెక్టార్‌లో ప్రపంచ స్థాయిలో ప్రత్యేకతను చాటుకునే దిశగా దుబాయ్‌లోని వైద్య రంగం ఇప్పటికే అభివృద్ధి చెందింది. ఆసుపత్రుల్లో ఇప్పటికే ఉన్న అద్భుతమైన సౌకర్యాలను మరింతగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దుబాయ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్‌లో భాగంగా వైద్య రంగంలో పెను మార్పులు రానున్న రోజుల్లో తీసుకురానున్నామని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







