ఖతార్ లో కొత్తగా 610 కేసులు నమోదు
- June 28, 2022
దోహా: ఖతార్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 610 కొత్త కమ్యూనిటీ కేసులు నమోదు కాగా.. ఇందులో 58 మంది ప్రయాణికులు ఉన్నారని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఏడు రోజుల్లో తొలి మరణం కూడా నమోదైంది. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 679కి చేరుకుంది. ప్రస్తుతం 4,873 యాక్టివ్ కేసులున్నాయి. ఖతార్‌లో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 380,530కు చేరుకుంది. రోజువారీ సగటు కోలుకున్న కేసుల సంఖ్య 457గా నమోదైంది. ఇప్పటి వరకు మొత్తం 1,682,286 బూస్టర్ డోసులు అందించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు కోవిడ్-19 వ్యాక్సిన్ మోతాదులు తీసుకున్న వారి సంఖ్య 6,974,984కు చేరింది. వివిధ ఆస్పత్రుల్లో 58 మంది కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..