ఒకే వస్తువు మీద రెండు సార్లు వ్యాట్ చెల్లించనవసరం లేదు

- June 28, 2022 , by Maagulf
ఒకే వస్తువు మీద రెండు సార్లు వ్యాట్ చెల్లించనవసరం లేదు

రియాద్: ఒకే వస్తువు లేదా సంబంధిత సేవల మీద రెండు సార్లు వ్యాట్ (value added tax) చెల్లించనవసరం లేదని జకాత్ పన్నులు మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) అధికారికంగా స్పష్టం చేసింది. అంతేకాకుండా ఒకే వస్తువు లేదా సంబంధిత సేవల మీద పదే పదే పన్నుల వేయడం అనేది ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘన చేసినట్లే అని పేర్కొంది. అలాగే, ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేయకుండా పన్నులు విధిస్తే సంబంధించిన పత్రాలను జోడించి వ్యాట్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. 

స్టోర్స్ లో కొంటున్న వస్తువుల మీద అదనపు వ్యాట్ వసూలు చేస్తున్నారు అని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ZATCA ఈ ప్రకటన జారీ చేసింది. 

వ్యాట్ స్లాబ్ లో 15 శాతం కింద వస్తువులు లేదా సేవలు ఏవైనా సరే సంబంధిత యాజమాన్య  వర్గాలు వ్యాట్ కింద నమోదు చేయాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com