పవన్ నెక్స్ సినిమాకు ముహూర్తం ఫిక్స్..
- April 11, 2016
పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రం తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత పవన్ చేయబోయే సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే పవన్ తాజా ఇంటర్యూలో ఎస్‌జె సూర్య, త్రివిక్రమ్‌లతో తర్వాతి సినిమాలు చేస్తానని ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఏ సినిమాను మొదట పట్టాలెక్కిస్తారా అని అభిమానులు ఆలోచిస్తుండగానే, పవన్ నెక్స్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి.త్రివిక్రమ్ ప్రస్తుతం అ..ఆ చిత్రంతో బిజీగా ఉన్నారు కాబట్టి .. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీకి కాస్త టైం పడుతుందనే చెప్పొచ్చు. ఖుషి, కొమరం పుటి వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు ఎస్‌జె సూర్య పవన్ హీరోగా తన తాజా చిత్రాన్ని ఈ నెలలోనే గ్రాండ్‌గా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. పవన్, సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీకి అనూప్ సంగీత దర్శకుడిగా పనిచేయనున్నారని తెలుస్తుండగా, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలు రికార్డింగ్ పూర్తి చేసారని టాక్. ఏప్రిల్ 29న ఈ చిత్రాన్ని లాంచ్ చేయనన్నట్టు టాక్. పవన్, సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం ఖుషీకి సీక్వెల్‌గా ఓ రొమాంటిక్ కామెడీగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







