ఫహాహీల్ రోడ్‌లో నగ్నంగా తిరుగుతున్న భారత ప్రవాసుడు అరెస్ట్..!
- June 30, 2022
కువైట్ సిటీ: కువైట్ లోని ఫహాహీల్ రోడ్‌లో నగ్నంగా తిరుగుతున్న ఓ భారత ప్రవాసుడిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అంతర్గత మంత్రిత్వశాఖకు ఓ వ్యక్తి హైవే పై బట్టలు విప్పేసి తిరుగుతున్నట్లు సమాచారం అందింది.దాంతో అధికారులు వెంటనే ఆ ఏరియాలో పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులకు సమాచారం అందించారు.అధికారుల సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అహ్మదీ ప్రాంతంలో భారత ప్రవాసీయుడిని అరెస్ట్ చేశారు. అయితే, పోలీసులు అక్కడికి వచ్చేసరికి ఆ వ్యక్తి ఒంటి పై నూలుపోగు లేకుండా రోడ్డు పై తిరుగుతున్నాడు.ఆ సమయంలో అతడు అసాధారణ స్థితిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.అదుపులోకి తీసుకున్న తర్వాత మెడికల్ టెస్ట్ కోసం ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తి మాదక ద్రవ్యాలు సేవించి ఉండొచ్చనే అనుమానంతో డ్రగ్ టెస్టు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అతడి పై న్యూసెన్స్ కేసు నమోదు చేసినట్లు ఫహాహీల్ పోలీసులు వెల్లడించారు.అయితే, ఆ వ్యక్తి వివరాలను వెల్లడించలేదు.సాధారణ స్థితికి వస్తే గానీ,అతడి వివరాలు తెలియవని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







