భారత్ కరోనా అప్డేట్
- July 01, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో 17,070 మందికి వైరస్ సోకినట్టు తేలింది. దాంతో, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1 లక్ష 7 వేల 189కి చేరుకుంది. క్రియాశీల రేటు 0.25గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.40 శాతంగా ఉంది.
అయితే, మొన్నటి పోలిస్తే కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. మొన్న 18,819 కేసులు రాగా.. తాజాగా 1500 కు పైగా కేసులు తగ్గాయి. మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది. మొన్న 39 మంది మరణించగా… గడచిన 24 గంటల్లో 23 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దాంతో, దేశంలో కరోనా మరణాల సంఖ్య 5 లక్షల 25 వేల 139కు చేరుకుంది. మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది.
గడచిన 24 గంటల్లో 14 వేల 413 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో, వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4 కోట్ల 28 లక్షల 36 వేల 906కి చేరుకుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 197 కోట్ల 74 లక్షల పైచిలుకు వ్యాక్సిన్లు అందజేశారు. నిన్న ఒక్క రోజే 11 లక్షల 67 వేల 503 డోసులు ఇచ్చారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







