యూఏఈలో ఇంధన ధరల ఆధారంగా టాక్సీ ఛార్జీలు
- July 01, 2022
షార్జా: జూలై 1 నుంచి ఇంధన ధరల ఆధారంగా టాక్సీ ఛార్జీలు మారనున్నాయి. జూలై 1 నుండి యూఏఈ ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించే ఇంధన ధరల ఆధారంగా షార్జాలో టాక్సీ ఛార్జీలు పెరగడం లేదా తగ్గడం జరుగవచ్చు. ఇంధన ధరలను బట్టి ప్రతి నెలా మీటర్ ఫ్లాగ్ డౌన్ రేటును పెంచడం లేదా తగ్గించడం జరుగుతుందని షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (SRTA) తెలిపింది. యూఏఈ ఇంధన ధరల కమిటీ ప్రతి నెలాఖరున ఇంధన ధరలను ప్రకటిస్తుంది. గ్లోబల్ చమురు ధరలతో స్థానిక ఇంధన ధరలను సమం చేయాలని దేశం ఆగస్టు 2015లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇది అమల్లో ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా జనవరి 2022 నుండి యూఏఈలో పెట్రోల్ ధరలు 56 శాతానికి పైగా పెరిగాయి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







