బంగారం దిగుమతి సుంకం పెంచిన భారత ప్రభుత్వం
- July 02, 2022
న్యూ ఢిల్లీ: బంగారం పై కేంద్రం దిగుమతి సుంకం పెంచడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10.75 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జూన్ 30 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రావడంతో బంగారం ధరలు పెరిగాయి. శుక్రవారం రాత్రి మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,440 పెరిగి, రూ.51,957గా ఉంది.హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.53,690గా ఉంది.
రాబోయేది పండుగల సీజన్ కాబట్టి, ఈ సమయంలో బంగారం ఎక్కువగా దిగుమతి అవుతుంది. పైగా అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ (31.10గ్రాములు) బంగారం ధర 1,800 డాలర్లకు దిగువనే ఉంది. దీంతో దిగుమతులు పెరిగే అవకాశం ఉంది. 2021 ఏప్రిల్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు మన దేశంలోకి 842.28 టన్నుల బంగారం దిగుమతి అయ్యింది. ఈ ఏడాది మేలో బంగారం దిగుమతులు పెరిగాయి. మేలో 107 టన్నులు దిగుమతి అయ్యింది.జూన్‌లో కూడా గణనీయంగా దిగుమతులు పెరిగినట్లు అంచనా. బంగారం దిగుమతి పెరిగితే, విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి. ద్రవ్యలోటు కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దీనివల్ల దిగుమతులు తగ్గే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.
బంగారం దిగుమతిపై 7.5 శాతం ఉన్న బేసిక్ కస్టమ్స్ ట్యాక్స్‌ను 12.5 శాతానికి పెంచారు. ‘‘ప్రస్తుతం దేశంలో బంగారం ఉత్పత్తి జరగడం లేదు. బంగారం కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీనివల్లే విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి. అందువల్లే బంగారం దిగుమతిని తగ్గించాలనే ఉద్దేశంతో సుంకాన్ని పెంచాం’’ అని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. విదేశాలతో పోలిస్తే మన దేశంలో బంగారంపై పన్నులు, ధర 12.5 శాతం ఎక్కువ కావడం వల్ల స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







