'గో చాట్' ను ప్రారంభించిన ఎతిసలాత్

- July 02, 2022 , by Maagulf
\'గో చాట్\' ను ప్రారంభించిన ఎతిసలాత్

యూఏఈ: యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ  టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ ఎతిసలాత్ కంపెనీ వాయిస్ మరియు వీడియో కాలింగ్ ఫీచర్స్ తో కూడిన 'గో చాట్' యాప్ ను జూలై 1 తేదీన ప్రారంభించింది. అలాగే వాయిస్ మరియు వీడియో కాలింగ్ సౌకర్యాలను ఉచితంగానే ఇస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. 

ఈ యాప్ సేవలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ వినియోగించేందుకు మరియు డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ఆండ్రాయిడ్ మరియు IOS స్టోర్స్ లలో ఉంచడం జరిగింది.  మొబైల్ నంబర్ తో యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు . అలాగే, యూఏఈ పౌరులు పలు రకాల సేవలను పొందేందుకు మరియు వినియోగించుకునేందుకు వీలుగా ఈ యాప్ ను రూపొందించడం జరిగింది.  

అలాగే, వివిధ ఇంటర్నెట్ కాలింగ్ వేదికలైన బోటిమ్ (Botim), సి మీ (C'Me), హు (Hiu) మరియు వాయికో (Voico)ల యొక్క సేవలను వినియోగించేందుకు వీలుగా ఈ యాప్ రూపొందించబడిందని ఎతిసలాత్ తన వెబ్సైట్ లో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com