'గో చాట్' ను ప్రారంభించిన ఎతిసలాత్
- July 02, 2022
యూఏఈ: యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ ఎతిసలాత్ కంపెనీ వాయిస్ మరియు వీడియో కాలింగ్ ఫీచర్స్ తో కూడిన 'గో చాట్' యాప్ ను జూలై 1 తేదీన ప్రారంభించింది. అలాగే వాయిస్ మరియు వీడియో కాలింగ్ సౌకర్యాలను ఉచితంగానే ఇస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఈ యాప్ సేవలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ వినియోగించేందుకు మరియు డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ఆండ్రాయిడ్ మరియు IOS స్టోర్స్ లలో ఉంచడం జరిగింది. మొబైల్ నంబర్ తో యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు . అలాగే, యూఏఈ పౌరులు పలు రకాల సేవలను పొందేందుకు మరియు వినియోగించుకునేందుకు వీలుగా ఈ యాప్ ను రూపొందించడం జరిగింది.
అలాగే, వివిధ ఇంటర్నెట్ కాలింగ్ వేదికలైన బోటిమ్ (Botim), సి మీ (C'Me), హు (Hiu) మరియు వాయికో (Voico)ల యొక్క సేవలను వినియోగించేందుకు వీలుగా ఈ యాప్ రూపొందించబడిందని ఎతిసలాత్ తన వెబ్సైట్ లో పేర్కొంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







