కువైట్ లో మళ్లీ ఆ నిబంధన అమలు
- July 03, 2022
కువైట్ సిటీ: కువైట్ మరోసారి ఐసోలేషన్ నిబంధను అమలులోకి తీసుకువచ్చింది.కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిన వారు తప్పనిసరిగా ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.ఇమ్యూన్ యాప్ ద్వారా పాజిటివ్ కేసులను మానిటరింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.ఇంతకు ముందు ఉన్న ష్లోనిక్ యాప్ స్థానంలో ఇమ్యూన్ యాప్‌ను తీసుకువచ్చినట్లు తెలిపింది.ఇక పై కరోనా పాజిటివ్ తేలిన వారు తప్పనిసరిగా ఐదు రోజుల పాటు ఐసోలేషన్ ఉండాలని, అలాగే ఆ తర్వాత మరో ఐదురోజులు ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి అని శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఎవరైతే కరోనా బారిన పడతారో వారి ఇమ్యూన్ యాప్ స్టేటస్ ఆటోమెటిక్‌గా రెడ్‌గా ఉంటుందని పేర్కొంది.పౌరులు, నివాసితులు ఈ నిబంధనను తప్పకుండా పాటించాలని సూచించింది.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









