మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టిచర్యలు: బహ్రెయిన్
- July 03, 2022
వియన్నా: మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో అంతర్జాతీయ స్థాయిని పెంపొందించడానికి, ప్రపంచ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, సమన్వయం, వ్యక్తుల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి సంబంధించిన సాధారణ సమస్యలపై దృష్టి సారించినట్లు బహ్రెయిన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జమాల్ అబ్దుల్ అజీజ్ అల్ అలావి తెలిపారు. జూన్ 29-30 తేదీల్లో వియన్నాలో జరిగిన వ్యక్తుల అక్రమ రవాణాపై వర్కింగ్ గ్రూప్ 12వ సమావేశంలో అజీజ్ అల్ అలావి పాల్గొని మాట్లాడారు. కింగ్ హమద్ బిన్ ఇసా అల్-ఖలీఫా విధానానికి అనుగుణంగా, ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్-ఖలీఫా మద్దతుతో.. మానవ అక్రమ రవాణాను నిర్మూలించడానికి, మానవ హక్కులను పరిరక్షించడానికి బహ్రెయిన్ నిబద్ధతను వారు స్పష్టం చేశారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి జాతీయ వ్యవస్థ, చట్టాలను అభివృద్ధి చేయడానికి బహ్రెయిన్ నిరంతరం పనిచేస్తోందని వారు తెలిపారు. మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి నియమించిన జాతీయ కమిటీ కార్యదర్శి డైజ్ ఖలీఫా అల్-బినాలితో కూడిన ప్రతినిధి బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!









