డెలివరీ బాయ్స్ వర్క్ పర్మిట్‌ల బదిలీ!

- July 03, 2022 , by Maagulf
డెలివరీ బాయ్స్ వర్క్ పర్మిట్‌ల బదిలీ!

కువైట్: డెలివరీ కంపెనీలకు అధికారికంగా, చట్టబద్ధంగా వారి వర్క్ పర్మిట్‌లను బదిలీ చేయడం ద్వారా నివాసం, కార్మిక చట్టాలను ఉల్లంఘించే హోమ్ డెలివరీ కార్మికుల సమస్యకు సమూల పరిష్కారాలను కనుగొనే అవకాశం ఉందని ట్రాఫిక్, ఆపరేషన్స్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ జమాల్ అల్-సయేగ్ అన్నారు. లైసెన్సింగ్, రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రాఫిక్ విభాగం.. పబ్లిక్ అథారిటీ సహకారం, సమన్వయంతో పని చేస్తోందన్నారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ థియేటర్‌లో డెలివరీ కార్మికులకు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు. రోడ్లపై డెలివరీ డ్రైవర్లు ట్రాఫిక్ భద్రతా విధానాలను అనుసరించాలని, భద్రతా చర్యలకు కట్టుబడి పనిచేయాలని జమాల్ అల్-సయేగ్ సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com