మెగా పవర్ స్టార్‌తో శంకర్ ప్రయోగం: అంచనాలు పెంచేస్తోందిగా.!
- July 03, 2022
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పలు రకాల టైటిల్స్ పరిశీలనలో వున్నాయ్. అందులో ఒకటి ‘సిటిజన్’. అనే టైటిల్. కాగా, ఈ సినిమాకి సంబంధించి మరో కీలకమైన అప్డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్న రకాల పాత్రల్లో కనిపించనున్నాడట. అంటే డబుల్ రోల్ అన్నమాట. అందులో ఒకటి తండ్రి పాత్రని తెలుస్తోంది. తండ్రి పాత్ర చాలా డిఫరెంట్ లుక్స్‌లో వుండబోతోందట. ఆ లుక్‌కి చరణ్ చాలా బాగా సెట్టయ్యాడనీ ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.
గతంలో చరణ్ డబుల్ రోల్ పోషించిన ‘నాయక్’ సినిమా బిగ్గెస్ట్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కెరీర్ తొలి నాళ్లలో చేసిన సినిమా ఇది. కానీ, ఇప్పుడు చరణ్ స్టార్ హీరో. అందులోనూ ప్యాన్ ఇండియా గుర్తింపు దక్కించుకున్న హీరో కావడంతో, ఇప్పుడు చరణ్‌పై అంతులేని అంచనాలున్నాయి.
సో, శంకర్ చేసే ఈ ప్రయోగం ఖచ్చితంగా ఫెయిల్ అవ్వకూడదు. ‘ఆర్ఆర్ఆర్’తో బీభత్సమైన సక్సెస్ అందుకున్న చరణ్, ఆ వెంటనే ‘ఆచార్య’తో డిజాస్టర్ చవి చూసిన సంగతి తెలిసిందే. అందుకే శంకర్ సినిమా విషయంలో ఇంకాస్త జాగ్రత్రగా వుండాల్సిన అవసరం వుంది.
ప్రస్తుతం అమృత్ సర్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ తర్వాత హైద్రాబాద్‌లో చివరి షెడ్యూల్ షూటింగ్‌కి ప్లాన్ చేయనున్నారట. ఈ సినిమాలో హీరోయిన్గా కైరా అద్వానీ నటిస్తోంది. అలాగే, అంజలి, సునీల్, శ్రీకాంత్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







