హ్యాపీ బర్త్ డే..సీరియల్ కామెడీ: పేరేదైతేనేం.. కామెడీనే కదా బాస్.!
- July 03, 2022
అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘హ్యాపీ బర్త్ డే’ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు అన్ని వర్గాల ఆడియన్స్‌ని విశేషంగా ఆకర్షిస్తున్నాయ్.
దాంతో ఈ సినిమా ఓ పెద్ద టాకింగ్ టాకీస్ అయ్యిందిప్పుడు. అందులోనూ పెద్దన్న రాజమౌళి ఆశీస్సులు కూడా పుచ్చుకుంది ఈ సినిమా. రేపో ఎల్లుండో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిన్న సినిమానే. కానీ, ప్రమోషన్లు ఘనంగా చేస్తున్నారు.
ఆషా మాషీ ప్రమోషన్లు కూడా కావవి. చాలా ఇన్నోవేటివ్‌గా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా సినిమాలోని కామెడీ గురించి మాట్లాడుతూ డైరెక్టర్ రితేష్ రాణా కొన్ని ఆసక్తికరమైన అంశాలు వివరించాడు.
ఈ సినిమాలోని కామెడీని సర్రియల్ కామెడీ అంటారట. కామెడీలో ఇదో కొత్త రకం జోనర్ అట. సర్రియల్ కామెడీ అంటే.. ఏం లేదు.. అదో అర్ధం పర్ధం లేని కామెడీ అన్నమాట. లాజిక్కలేం వుండవ్.
నిజానికి ఈ తరహాలో గతంలో చాలానే సినిమాలొచ్చాయ్. అయితే వాటికి కొత్తగా పేర్లేం పెట్టలేదు కానీ, వాటిలో కొన్ని హిట్టయ్యాయ్.. కొన్ని అట్టర్ ఫ్లాఫ్ అయ్యాయ్.
అల్లరి నరేష్ చేసిన ‘సుడిగాడు’ సినిమా ఆ కోవకు చెందిందే. అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది ఆ సినిమా. కామెడీ వున్నంత మాత్రాన అన్ని సినిమాలూ హిట్ అవ్వాలని రూలేం లేదు ఇలా. రీసెంట్గా వచ్చిన ‘డీజె టిల్లు’ కూడా సూపర్ హిట్ కామెడీ సినిమానే. మరి, ‘హ్యాపీ బర్త్‌డే’ భవిష్యత్తు తెలియాలంటే, రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







