హ్యాపీ బర్త్ డే..సీరియల్ కామెడీ: పేరేదైతేనేం.. కామెడీనే కదా బాస్.!

- July 03, 2022 , by Maagulf
హ్యాపీ బర్త్ డే..సీరియల్ కామెడీ: పేరేదైతేనేం.. కామెడీనే కదా బాస్.!

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘హ్యాపీ బర్త్ డే’ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు అన్ని వర్గాల ఆడియన్స్‌ని విశేషంగా ఆకర్షిస్తున్నాయ్.

దాంతో  ఈ సినిమా ఓ పెద్ద టాకింగ్ టాకీస్ అయ్యిందిప్పుడు. అందులోనూ పెద్దన్న రాజమౌళి ఆశీస్సులు కూడా పుచ్చుకుంది ఈ సినిమా. రేపో ఎల్లుండో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిన్న సినిమానే. కానీ, ప్రమోషన్లు ఘనంగా చేస్తున్నారు.

ఆషా మాషీ ప్రమోషన్లు కూడా కావవి. చాలా ఇన్నోవేటివ్‌గా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా సినిమాలోని కామెడీ గురించి మాట్లాడుతూ డైరెక్టర్ రితేష్ రాణా కొన్ని ఆసక్తికరమైన అంశాలు వివరించాడు.

ఈ సినిమాలోని కామెడీని సర్రియల్ కామెడీ అంటారట. కామెడీలో ఇదో కొత్త రకం జోనర్ అట. సర్రియల్ కామెడీ అంటే.. ఏం లేదు.. అదో అర్ధం పర్ధం లేని కామెడీ అన్నమాట. లాజిక్కలేం వుండవ్.

నిజానికి ఈ తరహాలో గతంలో చాలానే సినిమాలొచ్చాయ్. అయితే వాటికి కొత్తగా పేర్లేం పెట్టలేదు కానీ, వాటిలో కొన్ని హిట్టయ్యాయ్.. కొన్ని అట్టర్ ఫ్లాఫ్ అయ్యాయ్.
 అల్లరి నరేష్ చేసిన ‘సుడిగాడు’ సినిమా ఆ కోవకు చెందిందే. అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది ఆ సినిమా. కామెడీ వున్నంత మాత్రాన అన్ని సినిమాలూ హిట్ అవ్వాలని రూలేం లేదు ఇలా. రీసెంట్‌గా వచ్చిన ‘డీజె టిల్లు’ కూడా సూపర్ హిట్ కామెడీ సినిమానే. మరి, ‘హ్యాపీ బర్త్‌డే’ భవిష్యత్తు తెలియాలంటే, రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com