కాఫీ విత్ కరణ్: సమంత ఏం చెప్పబోతోందో.!
- July 03, 2022
బాలీవుడ్ మోస్ట్ పాపులర్ షో కాఫీ విత్ కరణ్ షో. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, సెలబ్రిటీలతో చేసే టాక్ షో ఇది. సెలబ్రిటీలకు కాస్తంత హాట్‌గా, ఘాటుగా ప్రశ్నలు సంధిస్తూ, వారి నుంచి అంతే హాట్‌గా ఘాటైన సమాధానాలు రాబడుతుంటాడు ఈ షోలో కరణ్ జోహార్.
అయితే, ఈ టాక్ షోపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయ్. దాంతో ఈ టాక్ షో సీజన్ ఆపేయాలనుకున్నాడు కరణ్ జోహార్. కానీ, మళ్లీ ఈ సీజన్ స్టార్ట్ చేయబోతున్నాడట. అయితే, ఎంత నెగిటివిటీ వచ్చినా ఈ టాక్ షోకి వున్న క్రేజ్ కూడా అంతే రేంజ్లో వుంటుంది.
అందుకే త్వరలోనే మళ్లీ ఈ షో స్టార్ట్ చేయబోతున్నాడట కరణ్ జోహార్. ఎవరేమనుకున్నా సరే, ఈ సారి ఇంకాస్త ఘాటుగా, హాట్‌గా వుండబోతోందట ‘కాఫీ విత్ కరణ్’. ఈ టాక్ షోకి గెస్ట్లుగా అలియా భట్, సమంత తదితరుల్ని ఇప్పటికే లాక్ చేశాడట కరణ్ జోహార్.
అయితే, సమంత విషయానికి వస్తే, ఈ మధ్య సమంత విడాకుల ఇష్యూ ఎంత పెద్ద దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. సో, కరణ్ షో ద్వారా, ఈ ఇష్యూకి సంబంధించి ఘాటైన స్టఫ్ బయటికి వచ్చే అవకాశం వుందంటూ, సమంత అభిమానులు, టాలీవుడ్ జనాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







