కాఫీ విత్ కరణ్: సమంత ఏం చెప్పబోతోందో.!

- July 03, 2022 , by Maagulf
కాఫీ విత్ కరణ్: సమంత ఏం చెప్పబోతోందో.!

బాలీవుడ్ మోస్ట్ పాపులర్ షో కాఫీ విత్ కరణ్ షో. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, సెలబ్రిటీలతో చేసే టాక్ షో ఇది. సెలబ్రిటీలకు కాస్తంత హాట్‌గా, ఘాటుగా ప్రశ్నలు సంధిస్తూ, వారి నుంచి అంతే హాట్‌గా ఘాటైన సమాధానాలు రాబడుతుంటాడు ఈ షోలో కరణ్ జోహార్.
అయితే, ఈ టాక్ షోపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయ్. దాంతో ఈ టాక్ షో సీజన్‌ ఆపేయాలనుకున్నాడు కరణ్ జోహార్. కానీ, మళ్లీ ఈ సీజన్ స్టార్ట్ చేయబోతున్నాడట. అయితే, ఎంత నెగిటివిటీ వచ్చినా ఈ టాక్ షోకి వున్న క్రేజ్ కూడా అంతే రేంజ్‌లో వుంటుంది.
అందుకే త్వరలోనే మళ్లీ ఈ షో స్టార్ట్ చేయబోతున్నాడట కరణ్ జోహార్. ఎవరేమనుకున్నా సరే, ఈ సారి ఇంకాస్త ఘాటుగా, హాట్‌గా వుండబోతోందట ‘కాఫీ విత్ కరణ్’. ఈ టాక్ షోకి గెస్ట్‌లుగా అలియా భట్, సమంత తదితరుల్ని ఇప్పటికే లాక్ చేశాడట కరణ్ జోహార్.
అయితే, సమంత విషయానికి వస్తే, ఈ మధ్య సమంత విడాకుల ఇష్యూ ఎంత పెద్ద దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. సో, కరణ్ షో ద్వారా, ఈ ఇష్యూకి సంబంధించి ఘాటైన స్టఫ్ బయటికి వచ్చే అవకాశం వుందంటూ, సమంత అభిమానులు, టాలీవుడ్ జనాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com