కృత్రిమ ధరల పెరుగుదల కట్టడికి చర్యలు.. సౌదీ

- July 06, 2022 , by Maagulf
కృత్రిమ ధరల పెరుగుదల కట్టడికి చర్యలు.. సౌదీ

జెడ్డా: COVID-19 మహమ్మారి, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో సహా ప్రధాన సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదలకు కారణమయ్యాయని సౌదీ వాణిజ్య మంత్రి మాజిద్ అల్-కసాబీ ఓ సమావేశంలో తెలిపారు. ధరల పెరుగుదలకు దారితీసిన గ్లోబల్ ఈవెంట్‌లు, పెంపుదల ప్రభావాలను పరిష్కరించడానికి సౌదీ నాయకత్వం కట్టుబడి ఉందన్నారు.  ముఖ్యంగా కొవిడ్ మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారిగా ప్రభావితం చేసిందన్నారు. మార్చి 2021 - ఆర్థిక పునరుద్ధరణ జరిగినా.. సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉందని, డిమాండ్ సరఫరా కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మార్కెట్‌లో అసమతుల్యతను కలిగిస్తుందని, సహజంగానే ధరలు పెరిగే ఫలితం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మార్చి 2021లో సూయజ్ కెనాల్ ఘటన కూడా ప్రపంచ ఆర్థిక దుస్థితికి కొంత కారణం అయిందని అల్-కసాబీ తెలిపారు. ఫిబ్రవరి 2022లో రష్యా-ఉక్రెయిన్ వివాదం మొదలైందని.. ఈ యుద్ధం రవాణాపై తీవ్ర ప్రభావం చూపిందని, దీంతో సరఫరా గొలుసులలో సంక్షోభానికి దారితీసిందని మంత్రి తెలిపారు. పెరుగుతున్న అంతర్జాతీయ ధరల ప్రభావాలను తగ్గించడంలో పౌరులకు సహాయపడటానికి SR20 బిలియన్ల ($5.32 బిలియన్లు) కేటాయింపును ఆమోదించిన కింగ్ సల్మాన్ రాయల్ ఆర్డర్‌ను అల్-కసాబీ ప్రశంసించారు. కేటాయించిన డబ్బులో సగం సామాజిక బీమా లబ్ధిదారులకు, పౌర ఖాతా కార్యక్రమానికి వెళ్తుందని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com