తెలంగాణకు భారీ కోత విధించిన కేంద్ర ప్రభుత్వం
- July 06, 2022
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు భారీ షాకిచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం తీసుకునే రుణాల్లో భారీగా కోతను విధించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 52,167 కోట్ల రుణాలను తీసుకోవడానికి కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అయితే ఇందులో రూ. 19 వేల కోట్ల మేర కేంద్రం కోత విధించింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 33 వేల కోట్లకు మించి అప్పు చేయలేని పరిస్థితి నెలకొంది.
రాష్ట్రాలు తీసుకుంటున్న అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీవ్ర ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న బడ్జెట్ అప్పులతో పాటు, వివిధ కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలను కూడా ఎఫ్ఆర్బీఎం చట్టం పరిధిలోకి కేంద్రం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో, గత రెండేళ్లలో ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి రాష్ట్రాలు చేసిన అప్పులను… ఆమేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో కోత విధించింది.
ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకోవడంతో… ఇకపై కార్పొరేషన్లకు అప్పులు లభించకపోయే పరిస్థితి నెలకొంది. మరోవైపు తెలంగాణకు రావాల్సిన అప్పులను కేంద్రం కొంత కాలం నిలిపివేసింది. దీంతో, తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. తాజాగా రూ. 33 వేల కోట్ల వరకు రుణాలు పొందేందుకు అనుమతి లభించడంతో కొంత మేరకు ఉపశమనం లభించినట్టయింది.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్‌జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









