ఏపీ గవర్నర్ సంయిక్త కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సూర్య ప్రకాష్
- July 06, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో గవర్నర్ వారి సంయిక్త కార్యదర్శిగా పిఎస్ సూర్య ప్రకాష్ రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.2007 గ్రూప్ వన్ బ్యాచ్ కు చెందిన ఈయన ఇప్పటి వరకు కృష్ణా జిల్లా పరిషత్తు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహించి బదిలీపై రాజ్ భవన్ కు వచ్చారు.గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్సి ఆర్ పి సిసోడియాను కలిసిన అనంతరం, ఇప్పటి వరకు సంయిక్త కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలలో ఉన్న ఉప కార్యదర్శి సన్యాసి రావు నుండి చార్జి తీసుకున్నారు. ఖజానా, గణాంక శాఖ లో సంయిక్త సంచాలకులుగా ఉన్న సూర్య ప్రకాష్ గతంలో గుంటూరు జిల్లా పరిషత్తు సిఇఓగా, ముఖ్యమంత్రి కార్యదర్శి, దేవాదాయ శాఖ మంత్రికి వ్యక్తిగత కార్యదర్శిగా సమర్ధవంతంగా పనిచేసారు. తూర్పు గోదావరి జిల్లా ఖజానా శాఖలో ఉప సంచాలకులుగా, కర్నూలు అబ్కారీ శాఖలోనూ విధులు నిర్వర్తించారు. సంయిక్త కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సూర్య ప్రకాష్ ను రాజ్ భవన్ అధికారులు, ఉద్యోగులు కలిసి అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్‌జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









