6 ఏళ్లు పైబడినవారికి మాస్కులు తప్పనిసరి: ఖతార్
- July 07, 2022
దోహా: COVID-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి కొత్త నివారణ చర్యలకు కట్టుబడి ఉండాలని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MOPH) పిలుపునిచ్చింది. మూసివేసిన ప్రదేశాలతోపాటు అన్ని బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా ఫేస్ మాస్కులు ధరించాలని సూచించింది. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయించినట్లు పేర్కొంది. ఆరు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులందరికీ ఇప్పుడు ఫేస్ మాస్కులు ధరించడం తప్పనిసరి అని మంత్రిత్వ శాఖ వివరించింది. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, కార్యాలయాలు, ప్రజా రవాణా, మస్జీదులు, జిమ్‌లు, మాల్స్, దుకాణాలు, సినిమాహాళ్లు ఇతర మూసి ఉన్న బహిరంగ ప్రదేశాలలో తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఇటీవల ఖతార్‌లో రోజువారీ కొత్త COVID-19 కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. అర్హులైన వారందరూ బూస్టర్ డోసులను తీసుకోవాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఏదైనా పబ్లిక్ క్లోజ్డ్ ఇండోర్ ఏరియాల్లోకి ప్రవేశించడానికి ముందు Ehteraz అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని గ్రీన్ స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించింది. ఇప్పటివరకు ఖతార్‌లో 1.7 మిలియన్ల కంటే ఎక్కువ మందికి బూస్టర్ డోస్‌ను అందించినట్లు.. ఆరు నెలల క్రితం రెండవ డోస్‌ను తీసుకున్న 12 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు బూస్టర్ డోస్‌కు అర్హులని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







