సైబరాబాద్ లో ‘గ్రీవెన్స్ సెల్’ సమీక్షా సమావేశం

- July 07, 2022 , by Maagulf
సైబరాబాద్ లో ‘గ్రీవెన్స్ సెల్’ సమీక్షా సమావేశం

: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్లో డీసీపీలు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది తో ఈరోజు సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ సింగన్వర్, ఐపీఎస్., సైబరాబాద్ అడ్మిన్ డీసీపీ ఇందిరా  సమక్షంలో ఈరోజు గ్రీవెన్స్ సెల్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా.. డీసీపీ ఇందిరా మాట్లాడుతూ పోలీసుల సమస్యల పరిష్కారానికి సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేశామన్నారు.ఈరోజు ముఖ్యంగా పర్మిషన్స్, ఆర్మ్స్ లైసెన్స్, బ్లాస్టింగ్ పర్మిషన్లు, ముల్టిప్లెక్స్, పెట్రోల్ బంక్స్, ఈవెంట్స్ పర్మిషన్లు, HRMS వాడుక.,  సిబ్బంది సమస్యలు తదితర అంశాలు చర్చకు వచ్చాయి. గతవారం గ్రీవెన్స్ సెల్ కు వచ్చిన ఫిర్యాదులు పరిష్కారంపై సంతృప్తి వ్యక్తం చేశారు.అలాగే ఈవారం వచ్చిన ఫిర్యాదులను, పెండింగ్ ఫైల్స్ ను త్వరితగతిన క్లియర్ చేయాలన్నారు. సీఏఓ లు, సెక్షన్ సూపరింటెండెంట్లు ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలన్నారు. సిబ్బందికి సమస్యలుంటే ఉంటే గ్రీవెన్స్ సెల్(8333993272) ద్వారా తన దృష్టికి తీసుకురావాలన్నారు.

ఈ సమావేశంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు, ఐ‌పీఎస్., బాలానగర్ డీసీపీ సందీప్, సిఆర్ హెడ్ క్వార్టర్ ఏడీసీపీ ఎండీ రియాజ్ ఉల్ హక్, సిఎస్‌డబ్ల్యూ  ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రకళ, చీఫ్ అడ్మిన్ ఆఫీసర్ గీత మరియు వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com