కోలీవుడ్ హీరో విశాల్: రెండు లవ్ స్టోరీస్ అవుట్, కొత్తగా లవ్‌లో పడ్డాడా.?

- July 08, 2022 , by Maagulf
కోలీవుడ్ హీరో విశాల్: రెండు లవ్ స్టోరీస్ అవుట్, కొత్తగా లవ్‌లో పడ్డాడా.?

తెలుగు కుర్రాడే అయినా విశాల్ తమిళ స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు. గతంలో అర్జున్ రెడ్డి ఫేమ్ అనీషా రెడ్డితో విశాల్ ఎంగేజ్‌మెంట్ చేసుకుని, పెళ్లి పీటల వరకూ చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఏమైందో ఏమో తెలీదు కానీ, ఆ నిశ్చితార్ధం క్యాన్సిల్ చేసుకున్నాడు విశాల్.

అంతకు ముందే, శరత్ కుమార్ తనయ వరలక్ష్మితోనూ పీకల్లోతు ప్రేమాయణం కొనసాగించి ఆ ప్రేమను కూడా పెళ్లి దాకా తీసుకెళ్లలేకపోయాడు. తాజాగా మరోసారి విశాల్ ప్రేమలో వున్నట్లు తెలుస్తోంది. తెలియడమేంటీ.? స్వయానా విశాల్ బాబే తాను ప్రేమలో వున్నాననీ, అరేంజెడ్ మ్యారేజ్‌లు తన ఒంటికి పడవంటూ త్వరలోనే తన లవర్‌ని పరిచయం చేస్తానని ఫ్యాన్స్‌తో చెప్పాడట.

కాస్త విచిత్రంగానే వుంది. ఇంతవరకూ మనం చెప్పుకున్న వాటిల్లో అరేంజెడ్ మ్యారేజ్‌లు ఏమున్నాయ్.. అన్నీ లవ్ స్టోరీలే కదా.. అనుకుంటే మా తప్పు కాదు.. విశాల్ బాబు అలా సెలవిచ్చాడట ఇక్కడ లాజిక్కులు వెతకొద్దు. 

సరే పోనీ, ఇంతకీ విశాల్ కొత్త లవర్ ఎవరంటా.? ఆ విషయం మాత్రం అడగొద్దు. ఇప్పటికయితే సస్పెన్సే. త్వరలోనే రివీల్ చేస్తాడట విశాల్. ఇక, విశాల్ ప్రస్తుతం ‘లాఠీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం పలకల బాడీతో కుస్తీ పట్టులు పడుతున్నాడట విశాల్. అదీ సంగతి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com