సమంత..! కావాలనే చేస్తోందా ఇదంతా..!
- July 08, 2022
అక్కినేని కోడలిగా రాజీనామా చేశాకా.. అదేనండీ, నాగచైతన్యతో విడాకులు తీసుకున్నాకా సమంత చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ప్రతీరోజూ మీడియా అటెన్షన్ తనపైనే వుండేలా చూసుకుంటోంది. ఏ ఇష్యూనైనా తన పబ్లిసిటీ కోసం వాడేసుకుంటోంది సమంత.
సమంత ఇదంతా ఎందుకు చేస్తోంది.. అని కొందరు సినీ మేధావులు ఆరా తీయడం మొదలెట్టారట. ఆ ఆరాలో భాగంగా తేలిందేంటంట అధ్యక్షా.. విడాకుల అనంతరం తన జీవితం చాలా చాలా బాగుంది అనే సంకేతాలు వదిలేందుకే సమంత ఇదంతా చేస్తోంది అని తేల్చేశారట సో కాల్ట్ మేధావులు.
పీఆర్ టీమ్స్‌ని పెట్టుకుని సమంత కావాలనే ఈ చీప్ పబ్లిసిటీ స్టంట్లు చేయిస్తోందని ఆ వర్గం తేల్చేశారట. అంతేనా, ఈ మధ్య బాలీవుడ్‌కి సంబంధించి సమంత చేస్తున్న ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. అక్కడి ప్రముఖులతో బాగా స్నేహ సంబంధాలు పెంచేసుకుంది. పార్టీలకూ ఫంక్షన్లకూ బాగా అటెండ్ అవుతోంది. అవకాశం చిక్కితే అక్కడి స్టార్ ముద్దుగుమ్మలతో నాలుగు మంచి మాటలు పొగడ్తల రూపంలో వేయించేసుకుంటోంది.
నిజం చెప్పాలంటే, బాలీవుడ్‌లో సమంత విడాకుల అనంతరం చేసిన సినిమా ఒక్కటీ లేదు. అప్పుడెప్పుడో ‘ది ప్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌లో నటించిందంతే. తెలుగులో మాత్రం సమంత ఇమేజ్ అలాగే వుంది. అంతకు మించి అన్నా తక్కువేం కాదేమో. ఎందుకంటే, ప్రస్తుతం సమంత చేతిలో మూడు టాలీవుడ్ ప్రాజెక్టులున్నాయ్ మరి. అందులో రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీసే కావడం విశేషం.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







