మాజీ ఉద్యోగి వేధింపులపై ఫిర్యాదు

- April 12, 2016 , by Maagulf
మాజీ ఉద్యోగి వేధింపులపై ఫిర్యాదు

బుడైయాలోని ఓ కెఫెటేరియా ఉద్యోగి, మాజీ ఉద్యోగి వేధింపులను తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను కొడుతున్నాడనీ, హింసిస్తున్నాడనీ ఫిర్యాదులో బాధితుడు మొహమ్మద్‌ ఫైసల్‌ పేర్కొన్నారు. బుడైయాలోని కెఫెటేరియాలో పనిచేస్తున్న మొహమ్మద్‌ ఫైసల్‌, తనకు చెడ్డ పేరు వచ్చేలా ఆ మాజీ ఉద్యోగి వ్యవహరిస్తున్నాడనీ, అలాగే తన పాస్‌పోర్ట్‌ విషయంలోనూ వేధింపులకు గురిచేస్తున్నాడని వెల్లడించాడు. డబ్బు దొంగిలించినట్లుగా ఒప్పుకోవాలని తనపై మాజీ ఉద్యోగి వేధింపులకు దిగాడనీ, స్నేహితులతో కలిసి వచ్చిన అతడు తనను కొట్టాడని, 2000 బహ్రెయినీ దినార్ల కోసం ఇదంతా చేస్తున్నాడని ఫైసల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగం చేయలేక తాను ఉద్యోగం నుంచి బయటకు వచ్చాననీ, ఇండియన్‌ ఎంబసీ సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశానని ఫైసల్‌ వివరించాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com