రష్మిక ఆఫర్‌కి ఎసరు పెట్టేసిన కృతిశెట్టి: ఎలాగో తెలుసా.?
- July 09, 2022
కన్నడ బ్యూటీ రష్మిక మండన్నా ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా ఇమేజ్ కూడా సొంతం చేసుకుంది శ్రీవల్లిగా రష్మిక మండన్నా.
అంతేకాదు, ఫ్యాన్స్‌లో రష్మకకున్న క్రేజ్ వేరే లెవల్ కూడా. అందుకే తన సినిమా కోసం ముందుగా రష్మిక మండన్నానే అనుకున్నాడట డైరెక్టర్ లింగుస్వామి. కానీ, అనుకోని కారణాలతో ఆ ప్లేస్‌లోకి కృతిశెట్టి వచ్చి చేరిందట. ఆ రకంగా రష్మిక ఆఫర్ కృతిశెట్టి తన్నుకెళ్లిపోయింది. తాజాగా ఈ విషయాన్ని డైరెక్టర్ లింగుస్వామి వెల్లడించారు.
ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్’. రామ్ పోతినేని హీరోగా రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ‘ది వారియర్’. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు.
అందులో భాగంగానే ఇంతవరకూ విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయ్. ముఖ్యంగా ‘విజిల్ సాంగ్..’, ‘బుల్లెట్ సాంగ్’లోని రామ్ పోతినేని, హీరోయిన్ కృతిశెట్టి డాన్సులు కుర్రకారుని తెగ హుషారెత్తిస్తున్నాయ్. చూడాలి మరి, రిలీజ్ తర్వాత కూడా ఈ హుషారు ఇలాగే వుంటుందో లేదో.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







