మహేష్-త్రివిక్రమ్ మొదలెట్టేశారుగా.!

- July 09, 2022 , by Maagulf
మహేష్-త్రివిక్రమ్ మొదలెట్టేశారుగా.!


సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ తాజాగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఈ సినిమాని సెప్టెంబర్‌లో పట్టాలెక్కించనున్నట్లుగా ఓ శాంపిల్ వీడియో ఒకటి రిలీజ్ చేసి, కన్‌ఫామ్ చేశారు. ఈ వీడియోలో సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. మహేష్ బాబును ఈ సినిమాలో సరికొత్తగా ప్రొజెక్ట్ చేయనున్నాడట త్రివిక్రమ్. గెటప్ పరంగా కొన్ని ఛేంజెస్ ఆల్రెడీ సూచించాడట మహేష్‌కి త్రివిక్రమ్. మహేష్ బాబు అదే పనిలో బిజీగా వున్నారట. 

కాగా, గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖలేజా’ సూపర్ డూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ కాంబినేషన్‌పై భారీగా అంచనాలున్నాయ్. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్దేని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు, మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇటీవల రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. మొదట్లో మిక్స్‌డ్ టాక్ వచ్చినా, ఫైనల్‌గా సూపర్ హిట్ లిస్ట్‌లో చేరిపోయింది ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్ ఈ సినిమాలో మహేష్ బాబుతో జోడీ కట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com