ప్లీజ్.! రూమర్స్ ఆపేయ్యండి.! అంటూ ఫ్యాన్స్‌కి విజ్ఞప్తి చేసిన హీరో తనయుడు.!
- July 09, 2022
సీనియర్ హీరో విక్రమ్ హార్ట్ ఎటాక్‌తో హాస్పిటల్లో చేరారనీ, ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారంటూ శుక్రవారం ఓ వార్త ఫ్యాన్స్‌లో కలవరం పెంచిన సంగతి తెలిసిందే.
ఈ వార్తతో విక్రమ్ ఫ్యాన్సే కాదు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ కాస్త ఘాటుగా స్పిందించారు.
‘నాన్న బాగానే వున్నారు. జస్ట్ చిన్నపాటి చెస్ట్ పెయిన్‌తో నాన్న హాస్పిటల్లో చేరారు. ఆయనకు ఎలాంటి హార్ట్ ఎటాక్ రాలేదు. జనరల్ చెకప్ చేయించుకుని ఆయన డిశ్చార్జ్ అయిపోతారు.. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసి, మా కటుంబ సభ్యులను అలాగే, ఆయన అభిమానులనూ ఆందోళనకు గురి చేయొద్దు. ఆయనకు కొద్దిగా స్పేస్ ఇవ్వండి. ప్లీజ్...’ అంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్ధించాడు ధృవ్ విక్రమ్.
అవును నిజమే, తమ అభిమాన హీరోకి హార్ట్ ఎటాక్ అనే న్యూస్ నిజంగా హార్ట్ ఎటాక్ తెప్పించే విషయమే. ఇలాంటి వార్తలను కాస్త గోప్యంగా వుంచడమే మంచిది. గతంలో ఈ తరహా న్యూస్ కారణంగా పలువురు సెలబ్రిటీలు ఇబ్బంది పడిన సందర్భాలు అనేకం వున్నాయ్.
మరోవైపు విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ టీజర్ శుక్రవారం విడుదలైంది. ‘బాహుబలి’ స్పూర్తితో రూపొందిన సినిమా ఇది. మణిరత్నం ఈ సినిమాకి దర్శకుడు. విజువల్స్ గ్రాండియర్ లుక్ పరంగా బాహుబలికి గట్టి పోటీ ఇచ్చే సినిమా అవుతుందని కోలీవుడ్ జనం ఆశిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







