మారుతి స్పీడు మామూలుగా లేదుగా.!

- July 09, 2022 , by Maagulf
మారుతి స్పీడు మామూలుగా లేదుగా.!

‘ఈ రోజుల్లో’ అనే సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన మారుతి, ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. 
తన సినిమాల్లో హీరోకి ఏదో ఒక లోపం పెట్టి, దాని చుట్టూ ఫన్ క్రియేట్ చేయడమే మారుతి మార్క్ మేకింగ్ ఫార్ములా. అయితే, ఆ ఫార్ములాతో కొన్ని హిట్ అయ్యాయ్. కొన్ని ఫట్ అయ్యాయ్. బోరెత్తించేస్తున్నాడన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయ్.

రీసెంట్‌గా ‘పక్కా కమర్షియల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మారుతి, ఎప్పటిలాగే మూస కథనే ఎంచుకున్నాడన్న రెస్పాన్స్ అందుకున్నాడు. మరోవైపు అసలు కథా, కాకారకాయ్ లేనే లేదీ పిచ్చి కామెడీ సినిమాలో అంటూ.. కొంత మంది ఆగ్రహానికి కూడా గురయ్యాడనుకోండి.
అయినా కానీ, ప్రస్తుతం మారుతి చేతిలో ఏకంగా ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్, మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్టులున్న సంగతి తెలిసిందే. ఈ స్టార్ హీరోలతో సినిమాలు ఓకే అయితే చేశాడు కానీ, ఎప్పటికి ఈ సినిమాలు పట్టాలెక్కేది.. ప్రేక్షకుల్ని పలకరించేది ఎప్పుడో. కానీ, తాజాగా మరో మెగా హీరోని తన డైరీలో వేసేసుకుంటున్నాడు మారుతి.

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట. వీలైనంత త్వరలోనే ఈ సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నాడట. అయితే అధికారిక ప్రకటన ఏమీ లేదు కానీ, ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది. అన్నట్లు తేజుతో మారుతి గతంలో ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో ఓ సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com