‘ది ఘోస్ట్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
- July 09, 2022
హైదరాబాద్: కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. స్పై నేపథ్యంలో గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. సంక్రాంతి బరిలో నాగ చైతన్య తో కలిసి ‘బంగార్రాజు’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న నాగ్..ఇప్పుడు ‘ది ఘోస్ట్’ సినిమాతో రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏజ్‌లో కూడా నాగార్జున.. రా ఏజెంట్ పాత్రలో చేసిన స్టంట్స్ ఈ సినిమాలో హైలెట్ అని చెబుతున్నారు. ఇక ఈరోజు గ్లింప్స్ ను విడుదల చేసారు మేకర్స్.
ఇందులో నాగార్జున రెండు చేతుల్లో రెండు పెద్ద కత్తులు పట్టుకొని శత్రు మూకను ఊచకోత కోయడాన్ని చూడొచ్చు. ఫార్మల్ సూట్ లో కింగ్ చాలా క్రూరంగా కనిపిస్తున్నాడు. ఘోస్ట్-కిల్లింగ్ మెషిన్ వీడియో అతని ఆవేశాన్ని కోపాన్ని ప్రదర్శిస్తుంది. ఘోస్ట్ తో ఎప్పుడూ గొడవ పడకండి అని ఈ వీడియోలో పేర్కొన్నారు. దీనికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా సెట్ అయింది. విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ గ్లింప్స్ సినిమాపై కచ్చితంగా ఆసక్తిని రెట్టింపు చేస్తుంది. ఇదిలా ఉంటే దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తామని తాజా గ్లింప్స్ ద్వారా మేకర్స్ ప్రకటించారు.
ఇక ఈ సినిమాలో అందాల భామ సోనల్ చౌహాన్ హీరోయిన్గా నటిస్తుండగా, నారాయణ్ దాస్ కే నారంగ్, రామ్ మోహన్ రావు, శరత్ మరార్‌లు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







