60 వసంతాలు పూర్తి చేసుకున్న కువైట్ పాస్ పోర్ట్
- July 11, 2022
కువైట్: ఈ ఆదివారంతో కువైట్ దేశ పాస్ పోర్ట్ 60 వసంతాలు పూర్తి చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.స్వర్గీయ అమీర్ షేక్ అబ్దుల్లా అల్ సలీమ్ హయాంలో శాశ్వతమైన ప్రాతిపదికన దీనికి రూపకల్పన చేయడం జరిగింది.
అంతర్గత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని జాతీయ పర్యాటక వ్యవహారాల అధిపతి కల్నల్ మొహమ్మద్ అల్ ఖెద్రే మాట్లాడుతూ ఈ 6 దశాబ్దాల కాలంలో పాస్ పోర్ట్ ను అనేక సార్లు ఆధునీకరణ చేసినట్లు తెలిపారు.
ఆయన కొనసాగిస్తూ యూన్ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) నిర్దేశంచబడిన ప్రమాణాల ప్రకారం అన్ని రకాలుగా ఉపయోగ పడేలా మా పాస్ పోర్ట్ ను తయారు చేయడం జరిగింది. ఈ పాస్ పోర్ట్ లో సైతం మూడు రకాలు ఉన్నాయి. అవి ప్రత్యేకించి దౌత్య పరంగా, విధాన పరంగా శాశ్వతమైన, సాధారణ మరియు అత్యల్పం అని విభజించబడ్డాయి అని పేర్కొన్నారు.
ఇప్పటికే కువైట్ పాస్ పోర్ట్ కు అంతర్జాతీయ స్థాయి లో మంచి గుర్తింపు కలిగి ఉంది. అలాగే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడం జరిగిందని తెలిపారు. పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు మేము ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటామని తెలిపారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







