8 సంస్థలపై భారీగా జరిమానా విధించిన యూఏఈ

- July 11, 2022 , by Maagulf
8 సంస్థలపై భారీగా జరిమానా విధించిన యూఏఈ

 యూఏఈ: దేశ చట్టాలను అతిక్రమణ చేస్తూ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అవకతవకలకు పాల్పడిన కారణంగా 8 సంస్థలకు భారీగా జరిమానా విధించినట్లు యూఏఈ ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. 

దేశ ఆర్థిక వ్యవస్థను నష్ట పరిచేలా వ్యవహరిస్తున్న సంస్థలను తనిఖీ చేసేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ అధికార బృందం ఏర్పాటై తన కింద నమోదు చేయబడిన సుమారు 15000 సంస్థలలో సోదాలు నిర్వహించి 8 సంస్థల పై చర్యలు చేపట్టింది. 

వివిధ చట్టాలను అతిక్రమణలు చేసినందుకు గాను ఈ సంస్థలపై సుమారు Dh 3.55 మిలియన్ల జరిమానా విధించినట్లు తెలిపింది. 


ఆర్థిక మంత్రిత్వశాఖకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ మరియు ఎన్ ఫోర్స్ మెంట్ విభాగ అధిపతి మాట్లాడుతూ వివిధ చట్టాలను అతిక్రమణలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే వారిపై తీసుకునే కఠిన చర్యల్లో భాగంగానే ఈ సంస్థల పై భారీ జరిమానా మరియు న్యాయ పరమైన చర్యలకు పునుకున్నామని ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com