సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు నిషేదాన్ని ఉల్లంఘించిన భారీ జరిమానాలు
- July 12, 2022
న్యూ ఢిల్లీ: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు అమ్మేవారికి, వాడేవారికి జరిమానాలు విధించడం మొదలుపెట్టింది ఢిల్లీ గవర్నమెంట్. దేశ రాజధానిలో జులై 1నుంచి నిషేదం అమలవుతుండగా.. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ(డీపీసీసీ), అర్బన్ లోకల్ బాడీస్ సంయుక్తంగా సోమవారం ఒక్క రోజులో 119 మందికి జరిమానాలు విధించారు. ఆ ఫైన్ ల మొత్తం రూ.1.23కోట్ల వరకూ ఉందని అధికారులు చెప్తున్నారు.
ఫ్యాక్టరీల్లో, మార్కెట్ యూనిట్లలో నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నామని వెల్లడించారు. నిషేదం అమలైన రోజే మొదటి పది రోజుల పాటు హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం.. సోమవారం నుంచి పెనాల్టీలు మొదలుపెట్టింది. మరికొన్ని రోజుల్లో ఇన్స్పెక్షన్లు కూడా నిర్వహిస్తామని డీపీసీసీ చెప్పింది.
96 యూనిట్లలో డీపీసీసీ టీమ్స్ ఇన్స్పెక్షన్ జరిపాయని వాటిలో 59యూనిట్లకు జరిమానాలు విధించి మూసేశామని చెప్పారు. ఆ జరిమానాల మొత్తం రూ.1.23కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ యూనిట్లకు ఎలక్ట్రిక్ సప్లైని ఆపేయాలని సూచనలు అందాయని టీపీడీడీఎల్ డిస్కం వెల్లడించింది.
ప్రస్తుతం షాపులు, కమర్షియల్ యూనిట్ల మీదనే ఫోకస్ పెట్టామని వ్యక్తుల మీద కాదని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







